లక్ష్మీ గవ్వలు ,

 లక్ష్మీ గవ్వలు 

క్షీరసాగరాన్ని మధించినప్పుడు శంఖముతో పాటు అవతరించాయి ' లక్ష్మీగవ్వలు ' శంఖాన్ని లక్ష్మీదేవి సోదరునిగా భావిస్తే ' గవ్వ ని ఆమెకి చెల్లెలిగా భావిస్తారు . గవ్వల్లో రకరకాల

, రంగురంగుల గవ్వలెన్నో వున్నా - " పసుపురంగు'లో ప్రకాశించే గవ్వలని ' లక్ష్మీ గవ్వలు'గా లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు . వేద కాలంలో ఆర్థిక లావాదేవీల కోసం ' గవ్వలని ' నాణాలుగా వాడేవారు . ఆ కాలంలో కాసులు , నాణాలు , వరహాలు , రూపాయిల తయారీ గానీ , చెలామణి గానీ ఏర్పడలేదు . అప్పటివారు డబ్బు సంబంధమైన యిచ్చి పుచ్చుకునే వ్యవహారాలు కోసం ' లక్ష్మీ ' సహోదరి అయిన ' గవ్వ'ని వినియోగించేవారు . 

ఆ రోజుల్లో డబ్బుని లెక్కించే వస్తువు గవ్వ . ఎవరివద్ద ఎన్ని గవ్వలుంటే వారు అంత ధనవంతులు . గవ్వకి వున్న విలువ , ప్రాముఖ్యత అంతా యింతా కాదు . ధనం లేని దరిద్రులని ' చిల్లిగవ్వయినా లేని సన్నాసి ' అనేవారు . అంటే చిల్లి గవ్వకున్న పాటి విలువ కూడా దరిద్రుడికి లేదన్నమాట . ' చిల్లు గవ్వకూడా ' చెల్లుబాటయ్యేదన్నమాట . అలాగే ఏ పనీ చెయ్యని సోమరిపోతుని ' పనికి మాలినవాడు . వీడికంటే గుడ్డిగవ్వ నయం ' అని వ్యాఖ్యానించేవారు . అంటే గుడ్డి గవ్వకి కూడా అంతటి ప్రాముఖ్యత వుండేదన్నమాట . ఇంతటి ప్రాముఖ్యత గవ్వలకి లభించడానికి కారణం ... గవ్వలు ఐశ్వర్యవృద్ధి ప్రదాతలు ... 


ఇవి ఎక్కడ వుంటే అక్కడ సిరిసంపదలు వెల్లివిరుస్తాయి . గవ్వల గలగలలు వున్నచోట ధనలక్ష్మి తాండవిస్తుంది . అందుకే శ్రీలక్ష్మీదేవిని పూజించేటప్పుడు శంఖంతోపాటు యీ గవ్వలని కూడా పీఠం మీద వుంచి పూజించడం అనాదిగా వస్తోంది .

 మహాశివుడు అలంకరించుకునే ఆభరణాల్లో గవ్వలు కూడా వున్నాయి కనుకనే ఆయన్ని ' కపర్థి ' అన్నారు . శివుడి వాహనమైన నందీశ్వరుడి మెడలోనూ గవ్వలున్నాయి . ఆ విధంగా లక్ష్మీదేవికి సహజన్ములైన యీ ' లక్ష్మీగవ్వలు ' సాక్షాత్తూ లక్ష్మీ స్వరూపం . దీపావళినాడు గానీ , అక్షయ తృతీయనాడు గానీ , ఏదైనా గురువారం నాడు గానీ పసుపురంగులో వుండే ' మూడు లక్ష్మీగవ్వలు ' మీ ఇంట్లోని పూజా


మందిరంలో శ్రీలక్ష్మీదేవి ముందుంచి లక్ష్మీపూజ చెయ్యండి . పూజానంతరం ' లక్ష్మీగవ్వలు ' మీ బీరువాలో లేదా ఖజానా పెట్టె , లేదా షాపైతే గల్లా పెట్టెలో వుంచండి . అంతే ... ధనలక్ష్మి తనంత తానుగా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది . మీ గృహం సిరిసంపదల నెలవు అవుతుంది .

కావలసిన వారు ఈ నెంబర్ కి ఫోన్ చేయండి

PH:9640633335 

COURIER ద్వారా HOME DELIVERY చేయబడును.

వాట్సాప్  గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి 
link మీదా క్లిక్ చేయండి https://chat.whatsapp.com/I9DxLtuoINv4K9zQ8yuy8J



Comments

Popular posts from this blog

గోమేధికం(GARNET) ధరించడం వల్ల ఉపయోగాలు ఏంటి ?

రుద్రాక్ష అంటే ఏంటి ? ఏ జాతకం వాళ్లు ఏ రుద్రాక్ష ధరించాలిఅనేది తెలుసుకోండి .

పచ్చ (Emerald) పచ్చ ఎవరు ధరించాలి దాని వల్ల ఉపయోగాలు ఏంటి