మరకత గణపతి,Emerald Ganapati అభివృద్ధికి చిహ్నం

మరకత గణపతి ఈ ' మరకతమణి గణపతి ' వ్యాపారాభివృద్ధి ప్రదాత . ఇతడినే ' పచ్చగణపతి ' అనికూడా ' మరకత మణి ' ఆకుపచ్చ రంగులో వుంటుంది ఈ ' ఆకుపచ్చ అభివృద్ధికి , ఉత్పత్తికి చిహ్నం , మరకతమణి మీద చెక్కిన గణపతి కనుక ఈయనను ' మరకత గణపతి ' అంటారు . ఉత్పత్తికి , వ్యాపారాభివృద్ధికి అధిపతి బుధుడు . జాతకంలో ' బుధ గ్రహదోషం ' వుంటే వ్యాపారం సరిగ్గా జరగక , అభివృద్ధి కుంటుపడి కష్టనష్టాలపాలవుతారు . వ్యాపార నష్టాలను చవిచూస్తున్నవారు ' బుధుడు ' కి ప్రియమైన ' బుధవారం ' నాడు ' మరకత గణపతి ' ని పూజించాలి . బుధవారం నాడు ఉదయమే కాలకృత్యాలు ముగించుకొని , వర్ణదుర్ముహూర్తాలో చూసుకొని ' మరకత గణపతి ' పూజ ప్రారంభించి యధావిధిగా పూజ చెయ్యాలి . అష్టోత్తర శతనామ పూజానంతరం ధూప , దీప నైవేద్య నీరాజనాలు సమర్పించిన అనంతరం ' బుధ గ్రహ దోషరిహారార్ధం .. వృత్తి వ్యాపారాభివృద్ధ్యర్ధం .... పేరు ఇష్టకామ్యఫల సిద్ధ్యర్ధం ... బుధ గ్రహ దేవతా స్వరూప మరకత గణములు క్రింది మంత్రాన్ని 108 సార్లు మంత్రజపం జపించాలి జపమంత్రం అనంతరం పూజాక్షతలు శిరస్సున ధరించి మరకత గణప...