Posts

Showing posts with the label రుద్రాక్ష

రుద్రాక్ష అంటే ఏంటి ? ఏ జాతకం వాళ్లు ఏ రుద్రాక్ష ధరించాలిఅనేది తెలుసుకోండి .

Image
రుద్రాక్ష కోసం మీకు తెలియని  విషయాలు. 1995 నుండి రుద్రాక్షల గురించి ఆధునిక శాస్త్రీయ దృక్పథంతో పరిశోధనలు జరుపుతున్నాను నేను . అనేక వేల సంవత్సరాల క్రితం వ్యాసమహర్షిచే వ్రాయబడిన లింగపురాణంలోనూ , శివపురాణంలోనూ తప్ప రుద్రాక్షల గురించి సవివరమైన సమాచారం మరే గ్రంథాలలోనూ నాకు లభించలేదు . కొన్ని ఆయుర్వేద గ్రంథాలలోనూ , దేవీ భాగవతంలోనూ రుద్రాక్షల గురించి ప్రస్తావన వున్నా అది కేవలం క్లుప్త అధోజ్ఞాపికలుగా పనికివచ్చే విషయ వస్తువే తప్ప విస్తృత సమాచారం కాదు . 🔶 ఆధునిక సాహిత్యంలో కూడా రుద్రాక్షల గురించి అట్టి సమాచారం లేదు . ఎంతో అరుదైన , అద్భుతమైన లక్షణాలు కలిగివుండే రుద్రాక్షల గురించి ఆధునిక జిజ్ఞాసువులెవ్వరూ సమగ్రమైన పరిశోధన చేపట్టక పోవడం దురదృష్టకరం .   🔶రుద్రాక్షల గురించి కొందరు పాశ్చాత్యులు వ్రాసిన వ్యాసాలు దైవికంగా నాకు లభ్యమవడం జరిగింది . అయితే ఆ విషయ వస్తువు కూడా ' అసలు ప్రతుల్లో కాక , మరెవరో ఆసక్తి కొద్దీ వ్రాసి పెట్టుకొన్న వ్రాత ప్రతుల్లోంచి లభ్యమయింది  మాత్రమే . అయినా ఆ సమాచారం అమూల్యమైనదిగా భావించవలసిందే . 🔶 రుద్రాక్ష ధారణవలన సుఖశాంతులు కలుగుతాయనీ , జ్ఞానం పెంపొందుతుందని , ...