రుద్రాక్ష అంటే ఏంటి ? ఏ జాతకం వాళ్లు ఏ రుద్రాక్ష ధరించాలిఅనేది తెలుసుకోండి .

రుద్రాక్ష కోసం మీకు తెలియని విషయాలు.

1995 నుండి రుద్రాక్షల గురించి ఆధునిక శాస్త్రీయ దృక్పథంతో పరిశోధనలు జరుపుతున్నాను నేను . అనేక వేల సంవత్సరాల క్రితం వ్యాసమహర్షిచే వ్రాయబడిన లింగపురాణంలోనూ , శివపురాణంలోనూ తప్ప రుద్రాక్షల గురించి సవివరమైన సమాచారం మరే గ్రంథాలలోనూ నాకు లభించలేదు . కొన్ని ఆయుర్వేద గ్రంథాలలోనూ , దేవీ భాగవతంలోనూ రుద్రాక్షల గురించి ప్రస్తావన వున్నా అది కేవలం క్లుప్త అధోజ్ఞాపికలుగా పనికివచ్చే విషయ వస్తువే తప్ప విస్తృత సమాచారం కాదు .

🔶 ఆధునిక సాహిత్యంలో కూడా రుద్రాక్షల గురించి అట్టి సమాచారం లేదు . ఎంతో అరుదైన , అద్భుతమైన లక్షణాలు కలిగివుండే రుద్రాక్షల గురించి ఆధునిక జిజ్ఞాసువులెవ్వరూ సమగ్రమైన పరిశోధన చేపట్టక పోవడం దురదృష్టకరం .
 
🔶రుద్రాక్షల గురించి కొందరు పాశ్చాత్యులు వ్రాసిన వ్యాసాలు దైవికంగా నాకు లభ్యమవడం జరిగింది . అయితే ఆ విషయ వస్తువు కూడా ' అసలు ప్రతుల్లో కాక , మరెవరో ఆసక్తి కొద్దీ వ్రాసి పెట్టుకొన్న వ్రాత ప్రతుల్లోంచి లభ్యమయింది  మాత్రమే . అయినా ఆ సమాచారం అమూల్యమైనదిగా భావించవలసిందే .

🔶 రుద్రాక్ష ధారణవలన సుఖశాంతులు కలుగుతాయనీ , జ్ఞానం పెంపొందుతుందని , ఆధ్యాత్మిక వికాసం కలుగుతుందని , కుండలినీ శక్తి వికసిస్తుందనీ , సకల సంపదలు లభిస్తాయనీ , ఆయురారోగ్యాలు వృద్ధి వెందుతాయనీ , మోక్ష ప్రాప్తి కలుగుతుందనీ మన ప్రాచీన గ్రంథాలు ఉదోషిస్తున్నాయి .
 
 🔶రుద్రాక్ష ధారణవలన మానసిక ప్రశాంతతా , బుద్ధికుశలత , ఆధ్యాత్మిక వికాసమూ కలుగుతాయని పురాణ గ్రంథాలు ఎంత పోషించినా , వాటిని ఆధునిక విజ్ఞానశాస్త్ర పరిధిలో ఋజువు చేయడానికి తగిన పరీక్షా పరికరాలుగానీ , విశ్లేషణా కొలబద్దలుగాని ..... గతంలో ఎవ్వరూ ఉపయోగించిన దాఖలాలు లేవు .
  
🔶 ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తోందంటే , అద్భుత శక్తులు గలవిగా చెప్పబడుతున్న రుద్రాక్ష ధారణవలన నిజంగా మానవజాతి లబ్ది పొందుతోందా అనే విషయం ఆధునిక శాస్త్ర పరిశోధనా పరిధిలో ఇంకా నిర్ధారింప బడవలసివుంది . ఆ రకమైన పరిశోధనలు చెయ్యడానికి ఎంతో బృహత్తర , ప్రణాళిక , నిధులు , ప్రయాస అవసరం . 
 
కాని , నా విచారణలో లభ్యమైన అనేక రుద్రాక్ష ధారకుల అనుభవాలు , రుద్రాక్ష ధారణ వలన ఎంతో ప్రయోజనం , ఫలితం వున్నట్లు తెలియచేస్తున్నాయి .

రుద్రాక్షలు ఎన్ని రకాలు

1.ఏకముఖి రుద్రాక్ష 

ఏకముఖి రుద్రాక్షకు అధిపతి గ్రహం సూర్యుడు . ఏకముఖి రుద్రాక్ష సాక్షాత్తూ శివ స్వరూపం . ఈ రుద్రాక్షను ధరించటం వల్ల బ్రహ్మహత్యాది మహాపాతకా
లు కూడా నశించిపోతాయి . పైగా లక్ష్మీ కటాక్షం అనన్యంగా ఉంటుంది . జ్యోతిష్య శాస్త్రాన్ని బట్టి ఏకముఖి రుద్రాక్ష ధారణ వల్ల సూర్యగ్రహ సంబంధిత దోషాలన్నీ పరిహారమవుతాయి . నేత్ర సంబంధిత రోగాలు , తలనొప్పి , హార్ట్ టాక్ , బోన్ రిలేటెడ్ డిసీజెస్ , ఉదర సంబంధ వ్యాధులు రావు . ఒకవేళ రుద్రాక్షధారణకు ముందే ఈ వ్యాధులు ఉన్న పక్షంలో అవి క్రమంగా తగ్గుముఖం పడతాయి . అంతేకాకుండా ప్రభుత్వరంగంలో పై అధికారులతో వచ్చే వివాదాలన్నీ సమసిపోతాయి . ఎర్రకెంపు లేదా మాణిక్యధారణ కన్నా అత్యుత్తమ స్థాయి సత్ఫలితాలను ఏకముఖి రుద్రాక్ష వల్ల పొందవచ్చును . 

2.ద్విముఖి రుద్రాక్ష 

దీనికి అధిపతి చంద్రుడు.ద్విముఖి రుద్రాక్ష శివశక్తి స్వరూపం . జనన కాలసమయంలో చంద్రుడు ప్రతికూల స్థానంలో ఉండి , విపరీత పరిణామాలను సృష్టిస్తున్న పక్షంలో ద్విముఖి రుద్రాక్షను ధరించటం మంచిది . దీని వల్ల గుండె , మెదడు , నరాలు , నేత్రాలు వంటి శరీర భాగాల్లోరాగల వ్యాధులు నయం అవుతాయి . చంద్రుని దుష్ప్రభావం పోయి, సిరిసంపదలు కలుగుతాయి . చంద్రగ్రహ దోష నివారణకు ముత్యంతో పాటు ద్విముఖి రుద్రాక్ష ధారణ మరీ మంచిది .

3.త్రిముఖి రుద్రాక్ష 

ఇది అగ్ని స్వరూపం . దీనికి అధివతి అంగారకుడు . రక్తం , మెడ , చెవులు , అండకోశం ,
జననేంద్రియాలు , భుజాలు , ఎర్రరక్తకణాలు , విటమిన్ల వంటి వాటిపై అంగారకుని ఆధిపత్యం ఉంటుంది . ఈ గ్రహం వల్ల కలిగే దుష్ప్రభావాల ఫలితంగా ఎనిమియా (రక్తహీనత ) , ప్లే , బ్లడ్ ప్రెషర్ , తెల్లబట్ట వంటి వ్యాధులు రావచ్చు . పైగా జన్మకాలంలో అంగారకుని ప్రభావం ఉంటే , దాన్ని కుజదోషంగా పరిగణిస్తూ , వివాహాది విషయాలలో జాప్యానికి కారణంగా చూపిస్తారు . ఎవరికైనా వివాహం జరిగి ఉన్న పక్షంలో , వారికి గర్భస్రావ ప్రమాదం కూడా ఉంటుంది . ఈ దోషాల పరిహారానికి త్రిముఖి రుద్రాక్ష శుభకరం . 

4.చతుర్ముఖి రుద్రాక్ష 

చతుర్ముఖుడైన బ్రహ్మకు ప్రతీక . ఈ రుద్రాక్షకు అధిపతి బుధుడు . విద్య , గణితం , జ్ఞానం
, రచన , జ్యోతిష విద్యల్లో మందకొండితనం ఉంటుంది . బుధగ్రహ ప్రతికూల పరిణామాల వల్ల అపస్మారకం, మానసిక రుగ్మతలు , పక్షవాతం , నాసిక వ్యాధులు వంటివి ఉంటాయి . ఈ దోష నివారణలకై చతుర్ముఖి రుద్రాక్ష ధారణ మంచిది . చతుర్ముఖి రుద్రాక్ష ధారణ వల్ల కళ్లల్లో తేజస్సు , కంఠస్వరంలో మాధుర్యం, ఆరోగ్య జీవన ప్రాప్తి కలుగుతుంది .

⭕5.పంచముఖి రుద్రాక్ష 

ఈ రుద్రాక్షకు అధిపతి బృహస్పతి , ధనం , వైభవం , గౌరవం , కీర్తి , ప్రతిష్టకు కారణమయ్యే
గ్రహంగా బృహస్పతికి పేరుంది . ఒకవేళ బృహస్పతి గ్రహ దుష్ప్రభావానికి గనుక ఎవరైనా లోనైతే , వారు అనేక కష్టనష్టాల పాలయ్యే ప్రమాదం ఉంటుంది . ఈ ప్రతికూల ప్రభావాల వల్ల ధనలేమి , దాంపత్య సుఖలేమి , అనారోగ్యం , తొడలు , కాళ్ల సంబంధిత వ్యాధులు మధుమేహం వంటివి రావచ్చు . ఈ అన్ని దోషాలకు నివారణగా పంచముఖి రాక్షలను ధరించటం మంచిది బృహస్పతి అనుకూలంగా ఉంటే సిరిసంపం చేకూరి , అన్నిటా అనుకూల పరిస్థితులు సుఖశాంతులు , ఖ్యాతి లభిస్తాయి . 

⭕6.షణ్ముఖి రుద్రాక్ష 

దీనికి అధిపతి శుక్రుడు . ఈ రుద్రాక్ష షణ్ముఖునికి , ఆయన సోదరుడైన గణపతికి ప్రతీక .
ఈ రుద్రా గా కార్తికేయుడే తన శిరస్సుపై ధరించాడు . జాతకంలో శుక్రగ్రహం అనుకూల స్థితుల్లో ఉంటే , భోగవిలాసాలు , సుఖశాంతులు ఉటాయి . అయితే శుక్రగ్రహం ప్రతికూల పరిస్థితుల్ని ఏర్పరుస్తోంటే , మనుషులకు జననేంద్రియ సంబంధిత వ్యాధులు , నేత్ర వ్యాధులు రావచ్చు . శుక్రగ్రహ అనుకూలత ఉంటే , కామం , సెక్సు , ప్రేమలతో బాటు సంగీత రంగాలలో కూడా పేరు తెచ్చుకోవచ్చు .

7.సప్తముఖి రుద్రాక్ష 

సప్తముఖి రుద్రాక్ష మాతృసప్తకానికీ , హనుమంతునికి ప్రతీక . పద్మ పురాణానుసారం
పుండరీకం , తక్షకం , విషోల్వణం , కరోషం , శంఖచుండం వంటి మహాబలశాలులైన విషనాగులు ఉన్నాయి . అయితే సప్తముఖి రుద్రాక్షను ధరించిన ఎవ్వరిపైన అయినా సరే , ఎలాంటి విషప్రభావము ఉండదు . సప్తముఖి రుద్రాక్షకు అధిపతి శని గ్రహం . శని గ్రహమనేది మృత్యువుకు , రోగాలకు నిలయం . శనిగ్రహ ఫలితంగా నపుంసకత , శ్రమ , అభివృద్ధి నిరోధకం , రక్తనాళవ్యాధులు సంభవించవచ్చును . శని గ్రహ దుష్ప్రభావ కారణంగా నిస్సత్తువ , వికలాంగత , పక్షవాతం వంటి వ్యాధులు రావచ్చు . మానసికచింత , విపరీతమైన ఆందోళన క్షయ వంటి సమస్యలూ ఎదురుకావచ్చు . శని కారణం వల్ల ఐశ్వర్యలేమి జరగవచ్చు . ఈ విపరీత ప్రభావాలను తట్టుకోవడానికి సప్తముఖీ రుద్రాక్ష ధారణం అత్యంత శ్రేయస్కరం . కాలసర్పదోషం ( సర్పదోషం ) ఉన్న వారికి సైతం సప్తముఖి రుద్రాక్షధారణ వల్ల మేలు జరుగుతుంది . 

⭕8.అష్టముఖి రుద్రాక్ష

దీనికి అధిపతి రాహువు . అష్టముఖి రుద్రాక్షల్లో కార్తికేయుడు , అష్టమాతృకలు , అష్టవాసుక
గణాలు , గంగ నివసిస్తున్నాయని అంటారు . రాహుగ్రహం దీని అధిపతి . ఇది కూడా శనిగ్రహం లాగే దీర్ఘకాలం వీడలను కలుగ జేస్తుంది . అన్నింటిలోనూ లోపాన్ని సృష్టించటం దీని పని . ఏ పని చేపట్టినా ఆలస్యం జరగటం , నష్టం జరగటం , కష్టం వాటిల్లటం వంటివి సంభవిస్తాయి . ఈ గ్రహ దుష్ప్రభావం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు , చర్మరోగాలు , సర్పభయాలు , అండకోశవ్యాధులు , కంటిలో శుక్లాలు వంటివి రావచ్చు . అయితే అష్టముఖి రుద్రాక్ష వల్ల ఈ సమస్త రోగాలు దూరమవుతాయి . గోమేధికధారణ వల్ల సత్ఫలితం ఎంత ఉంటుందో అష్టముఖి రుద్రాక్ష వల్లా అంతే సత్ఫలితం ఉంటుంది .

 ⭕9.నవముఖి రుద్రాక్ష 

 దీనికి అధిపతి కేతు గ్రహం . ఈ రుద్రాక్ష భైరవ స్వరూపం . కేతుగ్రహం గనుక ఆగ్రహిస్తే
అంటే జన్మకాలంలో కేతుగ్రహం విపరీత వలిత ప్రదాయకంగా ఉంటే జ్వరం , నేత్ర వ్యాధులు , ఉదర వ్యాధులు వంటివి రావచ్చు . కష్టాలు అధికం కావచ్చు . ఈ దోషాల నివారణకు నవముఖి రుద్రాక్ష అన్ని విధాల శ్రేయస్కరం .
 

⭕10.దశముఖి రుద్రాక్ష 

ఈ దశముఖి రుద్రాక్షలకు నవగ్రహాలూ అధినేతలు . ఈ దశముఖి రుద్రాక్షలో యముడు ,
విష్ణుదేవుడు , దశదిక్పాలకులు , దశ మహావిద్యలు నివనిస్తుంటాయని ప్రతీతి. ఈ దశముఖి రుద్రాక్షను ధరించడం వల్ల అన్ని గ్రహాలూ అనుకూలంగా మారుతాయి . తమ ప్రసన్నదృక్కుల్ని ప్రసరిస్తాయి . తన ప్రతిభ , ప్రభావం వల్ల దశముఖి రుద్రాక్ష శక్తిని , సమర్థతను కలుగజేస్తూ నవగ్రహాలనూ శాంతింపజేస్తుంది . సమస్త సుఖాలను సమస్త ఐశ్వర్యాలను అందజేస్తుంది .

⭕11.ఏకాదశముఖి రుద్రాక్ష 

 పదుకొండు ముఖాలుగల ఏకాదశముఖి రుద్రాక్ష ఏకాదశరుద్రుల చతుర్ముఖ బ్రహ్మాలలాటం నుండి లయకారుడిగా రుద్రుడు అవతరించిన తర్వాత రుద్రాంశతో
ఏకాదశరుద్రులు అవతరించారు . వీరినే రుద్రగణములు అటారు . దీనిని వీరభద్రుని స్వరూపంగా కూడా భావిస్తారు . ఏకాదశముఖి రుద్రాక్షకు అధిదేవత ఇంద్రుడు . ధ్యానము , జపము తపస్సులకు యిది శ్రేష్ఠము . ' పదకొండు ముఖాలు గల ఏకాదశముఖి రుద్రాక్ష సాక్షాత్తూ ఏకాదశ రుద్రుల స్వరూపము . దీనిని శిరస్సునందు ధరించిన వేయి అశ్వమేధయాగములు , నూరు వాజిపేయి యాగములు చేసిన ఫలం లభిస్తుంది . చంద్రగహణ సమయంలో ఏకాదశముఖి రుద్రాక్షని దానం చేసినా దానిని ధరించినంత పుణ్యఫలం లభిస్తుంది ' అని శివుడు తన కుమారుడైన కార్తికేయునికి చెప్పాడు.
 
✴️ • ఏకాదశముఖి రుద్రాక్ష ధారణ వలన వేయిగోవులను , వేయి అశ్వాలను దానం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది . 
  
✴️ • దీనిని శిరస్సున ధరించిన ధైర్యము , సంపద , జ్ఞానాభివృద్ధి కలుగుతుంది . 
  
✴️ • దీనిని ధరించిన స్త్రీలు ' దీర్ఘసుమంగళి'గా భాసిల్లుతారు . వైవాహిక జీవితములో సౌభాగ్యం , సంతోషం , పురుష సంతానం కలుగును .

⭕12 ద్వాదశముఖి రుద్రాక్ష . 

పన్నెండు ముఖాలుగల ద్వాదశముఖి రుద్రాక్ష విష్ణుస్వరూపము . ద్వాదశముఖి రుద్రాక్షకి అధిపతులు ద్వాదాశాదిత్యులు ' పన్నెండు ముఖాలు గల ద్వాదశముఖి రుద్రాక్ష సాక్షాత్తూ
సూర్యదేవుని స్వరూపము . దీనిని కంఠమునందు ధరించిన గోహత్య , నరహత్యాది పాతకాలు , మణులు నవరత్నాలు దొంగిలించడం వలన వచ్చు పాపములు నశిస్తాయి ' అని శివుడు తన కుమారుడైన స్కందునితో చెప్పాడు . ' ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ధారకులకు చోర , అగ్నిభయం వుండదు . మనోవ్యాధులు , చర్మవాధులు దరిచేరవు . గర్భదారిద్ర్యం తీరిపోతుంది . ఏనుగు , గుర్రం , నక్క కుక్క మార్జాలం వల్ల ఎలాంటి ప్రమాదాలూ , బాధలు సంభవించవు అని తెలిపాడు శివుడు. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్షతో సమానం . ఆరోగ్యం , ఐశ్వర్యం , ఆధ్యాత్మిక వికాసంతో పాటు ధారకులు సూర్యతేజస్సుతో ప్రకాశిస్తారు .

 ⭕13.త్రయోదశముఖి రుద్రాక్ష

  త్రయోదశముఖి రుద్రాక్ష శివుని హృదయమునందు పార్వతీదేవి పట్ల కామము కల్పించ ప్రయత్నించిన కామదేవుడు మన్మథుడు . శివపార్వతుల అనురాగ కారణమున

అవతరించిన వాడు షణ్ముఖుడు .
  
✴️ ప్రణయ అనురాగములకు అధిదేవుడు మన్మధుడు కనుక ఇది కామదేవుని స్వరూపము .
 
✴️శివపార్వతుల కామముచేత అవతరించినందున , ఇది షణ్ముఖుని . స్వరూపము .
  
✴️స్వర్గాధిపతి, దిక్పాలకుడు అయిన ఇంద్రుడు దీనికి అధిదేవత . 
   
✴️ఇది విశ్వాదేవి స్వరూపముగా భావిస్తారు . 
   
✴️ఇది అదృష్ట జాతకులకు మాత్రమే అరుదుగా లభిస్తుంది . ధారకుల కోర్కెలన్నీ నెరవేరుస్తుంది . 

✴️దీనిని ధరించిన సిద్ధులు , వశీకరణ శక్తులు లభిస్తాయి . 

✴️దీనిని ధరించిన ధన కనక వస్తు వాహనాది సమస్త సంపదలు చేకూరుతాయి.

✴️ఋణపీడ నుండి , బ్రహ్మపాతకమునుండి ధారకునికి విముక్తి లభిస్తుంది .

✴️మోక్షాపేక్షగల వారికి , నాయకత్వ అభిలాషగలవారికి యీ రుద్రాక్ష సత్ఫలితాన్నిస్తుంది .
 

⭕ 14 చతుర్దశముఖి రుద్రాక్ష

పదునాలుగు ముఖాలుగల రుద్రాక్ష శివుని ఫాలనేత్రమునకు ప్రతిరూపము 
ఫాలనేత్రము అంటే జ్ఞాననేత్రము 
పదునాల్గు భువనాలు , చతుర్దశ విద్యలు , చతుర్దశదేవతలు సాక్షాత్తూ రుద్రాంశ స్వరూపాలు . కాన యీ చతుర్దశముఖి పార్వతీసమేతుడైన రుద్ర స్వరూపంగా భావిస్తారు . 
శివాంశ సంభూతుడైన హనుమంతుని ప్రతిరూపముగా దీనిని భావిస్తారు .
✴️• సాక్షాత్తూ ఆ రుద్రుడే తన శిరస్సున దీనిని ధరిస్తాడని శివపురాణ ప్రవచనం . 

✴️• చతుర్దశముఖి ధారకులకు సర్వవ్యాధులు నశించి , సంపూర్ణ ఆరోగ్యముతో పాటు , సర్వసంపదలు పేరు ప్రఖ్యాతులు , గౌరమర్యాదలు , మానసిక ప్రశాంతి , వంశాభివృద్ధి లభిస్తుంది .

✴️• దీనిని ధరించిన వారి అంతర్నేత్రము విప్పారి జ్ఞానసిద్ధి పొందుతారు 

✴️• దీనిని శిరస్సునందు ధరించిన వారు త్రిలోక పూజ్యులై అంతమున శివసాయుజ్యం పొందుతారు . 

✴️• ఇది సర్వపాప , సర్వ భయనాశని 

✴️• పాలకులు , అధిపతులు , నాయకులు ధరించిన వారి అధికారము స్థిరత్వము నొందును

✴️• దీని ధారణా మహిమచేత సునిశిత దృష్టి , సుదృఢ నిర్ణయశక్తి లభిస్తుంది . దీనిని ధరించిన వారిని హనుమంతుడు అహర్నిశలూ సంరక్షిస్తూ వుంటాడు .

⭕15.పంచదశముఖి రుద్రాక్ష 
 
✴️పదిహేను ముఖాలుగల పంచదశముఖి పశుపతి నాధుని ప్రతి రూపము
✴️ పశుపతి నాథుడంటే నందివాహనుడైన పరమేశ్వరుడే .
 
✴️ పశువైన నందికి పరమేశ్వరత్త్వమును కల్పించాడు శివుడు .
 
✴️ నందికి తన ప్రమధ గణాలలో అగ్రతాంబూలమిచ్చి తనకీ నందికీ రూప నామభేదాలే తప్ప ఆత్మ ఒక్కటేనని చాటాడు శివుడు .
  
✴️ శివాలయమున - తన ఎదుట నందీశ్వరుని నిలుపుకొని పశుపతి నాథుడన్న ఖ్యాతి గడించాడు ఈశ్వరుడు .

⭕16.షోడశముఖి రుద్రాక్ష 
 పదహారు ముఖాలు గల యీ షోడశముఖి షోడశకళారూపిణియైన దేవి స్వరూపము
 
✴️షోడశి అంటే రాజరాజేశ్వరి . 

 
✴️ రాజరాజేశ్వరి అంశావతారమే ఐశ్వర్య ప్రదాయినియైన శ్రీమహాలక్ష్మి . 
 
✴️షోడశముఖి రుద్రాక్షను శ్రీలక్ష్మీ స్వరూపముగా భావిస్తారు . 

✴️ఈ షోడశముఖి రుద్రాక్షకు అధిదేవత రాహువు . షోడశముఖి ధారణ వలన దేవీ అనుగ్రహము విశేషముగా లభిస్తుంది .

✴️కళారంగములందున్న వారు విశేషమైన పేరు ప్రఖ్యాతులు పొందుతారు .
 
✴️షోడశముఖి రుద్రాక్ష ధారకుని గృహమునకు చోర , అగ్ని భయ ప్రమాదాలు సంభవించవు . 
 
✴️దీనిని ధరించినవారికి అపరిమితమైన ధైర్య సాహసములు లభిస్తాయి . దీనిని గృహమున భద్రపరచుకున్న , వారి యింట కనక వర్షము కురుస్తుంది . 

⭕17.దశసప్తముఖి రుద్రాక్ష

✴️ పదిహేను ముఖాలు గల దశసప్తముఖి రుద్రాక్ష విశ్వకర్మ స్వరూపము . 

✴️ శివపార్వతులకోసం కైలాస భవనాన్ని హిమలయాల్లో నిర్మించిన వాస్తు శిల్పి విశ్వకర్మ  
✴️ విశ్వమునకు తత్త్వ ప్రబోధము చేసిన ఆదిభిక్షకుడు , ఆదిగురువు శివుడు .
✴️దశసప్తముఖి రుద్రాక్ష ధారణ వలన అఖండ సంపద లభిస్తుంది . .
✴️ దీనిని ధరించిన ఆస్తి అంతస్తులు రెట్టింపుగా వృద్ధి చెందుతాయి . 
✴️ఆకస్మిక ధనలాభమునిచ్చు లాటరీ తదితరములందు విజయం చేకూరుతుంది 
✴️కంసాలి , వండ్రంగి వంటి వృత్తి కళాకారులు దీనిని ధరించిన విశేష నైపుణ్యాన్ని పొందుతారు . 
✴️ ధారకుడు తాను చేయు వృత్తి లేదా ఉద్యోగములందు ఉన్నతస్థాయికి చేరుకుంటాడు ,
✴️ఆధ్యాత్మిక ఔన్నత్యమును పొంది అత్యున్నత ఆధ్యాత్మిక శిఖరానికి ధారకుడు చేరుకుంటాడు . 
✴️ ఈ దశసప్తముఖి రుద్రాక్ష ఒకే ఒక శ్యామవర్ణములో మాత్రమే అరుదుగా లభిస్తుంది .

⭕18.అష్టాదశముఖి రుద్రాక్ష

✴️అష్టాదశముఖి రుద్రాక్ష భూదేవి స్వరూపము


✴️ భూదేవి అంటే ప్రకృతి , ప్రకృతి అనగా శక్తి , 
 
✴️ శక్తి అనగా అర్ధనారీశ్వరి . అర్థశరీరుడే శివుడు , అతడే పురుషుడ.
 
✴️శివశక్తి ఏకశరీరులు గనక రుద్ర ప్రసాదితమైన యీ రుద్రాక్ష శక్తి రూపకమైన భూదేవి ప్రతిరూపము . 

✴️ఈ రుద్రాక్ష ధారకులు భూదేవి అంతటి ఓర్పు , సహనములను కలిగి వుంటారు . 

✴️భూదేవి వలె సర్వజీవులనూ సమాదరిస్తారు .

✴️స్త్రీలు ధరించిన గర్భస్రావములు , యితర వ్యాధులు నివారణమవుతాయి . 

✴️గర్భిణిలు ధరించిన ప్రసవసంబంధమైన రుగ్మతలు దరిచేరవు . 

✴️ దీనిని ధరించిన వారి గృహంలో సిరిసంపదలు , పాడి పంటలు , సుఖశాంతులు వెల్లివిరుస్తాయి . 

✴️దీనిని ధరించిన వారి వంశము పుత్రపౌత్రాదులతో వృద్ధి చెందుతుంది . 

✴️ఈ అష్టాదశముఖి రుద్రాక్ష ఒకే ఒక్క శ్యామవర్ణములో లభిస్తుంది .

⭕19.ఊనవింశతిముఖి రుద్రాక్ష 


🔶వంతొమ్మిది ముఖాలు గల ఊనవింశతిముఖి రుద్రాక్ష నారాయణ స్వరూపము . 

🔶 శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే - శివకేశవులకు భేదాము లేదు . 


🔶 పరబ్రహ్మయైన శివుని నుండి అయోనిజుడై అవతరించాడు నారాయణుడు . 

🔶రుద్రాక్ష అవతరణానికి పరోక్ష కారకులైన త్రిపురాసుర సంహారమందు శివునికి అఘోరాస్త్రంగా మారి సహకరించాడు . విష్ణువు

🔶అఘోరాస్త్రం కోసం విష్ణువు అనుగ్రహాన్ని కోరి శివుడు తపస్సుచేస్తే - ఆ శివుని చేతియందు అస్త్రంగా యిమిడి శివకేశవులు ఒక్కరేనని చాటాడు విష్ణువు .

🔶 ఆ శివకేశవుల అభేదమునకు ప్రతిరూపమే ఊనవింశతిముఖి రుద్రాక్ష . ' గ్రహణ కాలము నందునూ , ఏకాదశి తదితర పుణ్య తిధులందును , దక్షిణాయన , ఉత్తరాయన సంక్రమణ పుణ్య సమయాలందూ , అమావాస్య , పూర్ణిమ దినములందు మరియే యితర పర్వదిజిలీలలోనూ రుద్రాక్షను ధరించిన వారు సర్వపాపాలనుండి విముక్తులవుతారు ' .


✴️ ఊనవింశతి ముఖి రుద్రాక్ష అరుదైనది . 

✴️ దీనిని ధరించినవారికి ఏలోటూ ఉండదు . రాదు . 

✴️ దీనిని ధరించిన వారికి నారాయణుని అనుగ్రహంతో పాటు లక్ష్మీ కటాక్షం కూడా లభిస్తుంది . 

✴️ దీనిని ధరించినవారికి సంకల్పాలన్నీ నెరవేరుతాయి . సర్వత్రా విజయం వరిస్తుంది . 

✴️దీనిని ధరించినవారికి సిరిసంపదలు , భోగాభాగ్యాలు చేకూరుతాయి .

✴️దీనిని ధరించినవారు ఇహమున నారాయణుని వలె భాసిల్లి పరమున శివసాయుజ్యం పొందుతారు . 

✴️ఇది కేవలం పీతవర్ణములోనే అరుదుగా లభిస్తుంది . 

⭕20.వింశతి ముఖి రుద్రాక్ష

ఇరువది ముఖాలు గల యీ వింశతిముఖి రుద్రాక్ష బ్రహ్మస్వరూపము . 

✴️ సృష్టికర్త బ్రహ్మ శ్రీమహావిష్ణువు నాభి కమలం నుండి అవతరించి తన పంచముఖాలు చూసుకుని అహంకారంతో పంచాత్మక , పంచముఖ స్వరూపుడైన శివుని ధిక్కరించాడు . తత్ఫలితంగా ఒక శిరస్సును కోల్పోయి చతుర్ముఖ బ్రహ్మ అయ్యాడు . 

✴️వేదపఠనం చేత పునీతుడైన బ్రహ్మకి ప్రతిరూపము వింశతిముఖి రుద్రాక్ష , 
✴️ శివుడి నుండి విష్ణువు , అతని నుండి బ్రహ్మ సంకల్ప ప్రభావంచేత అవతరించారు గాన బ్రహ్మ శివాంశ సంభూతుడుగా భావించబడు తున్నాడు . ఆ బ్రహ్మమునకు ప్రతిరూపము యీ వింశతిముఖి . 
✴️ఈ రుద్రాక్ష ధరించిన ధారకులపట్ల బ్రహ్మ ప్రీతి చెంది బ్రహ్మజ్ఞానం ప్రసాదిస్తాడని ప్రతితీ .
✴️వింశతిముఖి ధరించిన వారు బ్రహ్మ అనుగ్రహపాత్రులు అవుతారు . 
✴️దీనిని ధరించిన మానసిక శాంతి లభించి దైవముపై విశ్వాసము బలపడును
✴️దీనిని ధరించిన వారు పరిపాలకులు అవుతారు . 
✴️దీనిని ధరించిన వారు పరిశోధకులు అవుతారు .
✴️దీనిని ధరించిన వారిపై మంత్ర , తంత్ర , క్షుద్ర ప్రయోగాలు ఫలించవు . 
✴️ వింశతిముఖి రుద్రాక్ష ఒకే శ్వేత వర్ణములో లభిస్తుంది . . . .

⭕21.ఏక వింశతిముఖి రుద్రాక్ష 

ఇరువది ఒక్క ముఖాలు గల యీ ఏకవింశతిముఖి కుబేరస్వరూపము . అష్ట
ఐశ్వర్యములకు అధిపతి కుబేరుడు . కుబేరుడు నిష్కళంక శివభక్తుడు . శివుడి అనుగ్రహం చేత నవనిధులకూ , సిరిసంపదలకు అధిపతి అయ్యాడు . కుబేరుని వద్దనే కలియుగదైవమైన శ్రీవెంకటేశ్వరస్వామి దాని నిమిత్తం వడ్డీని యీనాటికీ చెల్లిస్తూనే వున్నాడు . లక్ష్మీపతి అయిన శ్రీనివాసుడు శివుని ప్రియభక్తుడు , మిత్రుడు అయిన కుబేరుని వద్ద అప్పు తీసుకోవడంలోని అంతర్ధాం ... ' శివకేశలకి భేదం లేదు ' అని వెల్లడించడమే ... కనుకనే ధనపతి అయిన కుబేర స్వరూపమైన యీ రుద్రాక్ష రుద్రుని ప్రతిరూపమే . ఏకవింశతిముఖి రుద్రాక్ష మాలను ' ఇంద్రమాల ' అని వ్యవహరిస్తారు . దీనిని ధరించిన వారికి అసాధ్యమైనదేదీ వుండదు . సర్వపంపదలు , జ్ఞానసిద్ధి , సర్వాభీష్టసిద్ధి దీనిని ధరించిన సిద్ధించును . దీనిని ధరించినవారు ఆగర్భదరిద్రులు సహితం రాజాధిరాజులో , చక్రవర్తులో పరిపాలకులో అవుతారు . ఈ ఏకవింశతిముఖి రుద్రాక్ష శ్వేతవర్ణములో మాత్రమే లభించును . ఏకవింశతిముఖి రుద్రాక్ష ఒకే ఒక్క శ్వేతవర్ణములో మాత్రం లభిస్తుంది . ఇది చాలా అరుదుగా అదృష్టజాతకులకి మాత్రమే లభిస్తుంది .

⭕22.నాగరుద్రాక్ష 

శ్యామవర్ణములో వుండు యీ రుద్రాక్ష నాగేంద్ర స్వామి ప్రతిరూపము , ఇది సర్పాకారముగా వుండును . 
కాలమునకు ప్రతి రూపము సర్పము . అట్టి కాలసర్పమును నియంత్రించువాడు . కాలరుద్రుడు . 
✴️• విష్ణుమూర్తికి తల్పము ఆదిశేషుడు . 
✴️• ఆదిశేషుని శిరస్సు పైన భూలోకము వర్ధిల్లుతున్నదని ప్రతీతి . 

✴️• శివునికి ఆభరణము నాగేంద్రుడు .
✴️• శివ సతి పార్వతికి మరో పేరు నాగేశ్వరి . 
✴️• శివ కుమారుడు షణ్ముఖుడు నాగేంద్ర ప్రతిరూపము .  
✴️• విఘ్నేశ్వరుని ఉదరభూషణము నాగాభరణము . 
✴️• త్రేతాయగమునందు రాముని తమ్ముడు తక్ష్మణుడుగా , ద్వాపరమందు శ్రీకృష్ణునికి అగ్రజునిగా అవతరించి . . . పూజలందుకున్నాడు అదిశేషుడు . 
✴️• యుగయుగమున దేవతమూర్తిగా వెలుగొందుతున్న నాగేంద్రుడు సర్వదేవతా ప్రియుడు . 
✴️• సర్వమానవాళికీ సంతాన సౌభాగ్యప్రదాత నాగరాజు , 
✴️• సర్పాకారమును పోలివుండే నాగరుద్రాక్షను పూజామందిరములో వుంచి పూజించాలి కానీ , దీనిని శరీరమున ధరించరాదు . 
✴️• కుజ , రాహు , కేతు మహర్ధశలు జాతకరీత్యా జరుగుచున్నవారు , కుజ , రాహు , కేతు గ్రహ దోషములున్నవారు యీ రుద్రాక్షను పూజామందిరమున వుంచి పూజించిన శుభం జరుగును .
✴️• సంతానములేనివారు దీనిని పూజించిన సత్సంతానమును పొందగలరు .
✴️ • సర్పదోషమున్నవారు దీనిని పూజించిన సర్పభయం తొలుగుతుంది . వీరికి పాముకాటు భయం వుండదు . మరియు దీనిని పూజించినవారికి కాలసర్పదోషము అంటే అకాల మృత్యుభయం తొలగును . 
✴️ • ఈ రుద్రాక్షమీద నాగపడగ లేదా సర్పాకారము గోరించును . 
✴️ • అత్యధ్భుత మహిమగల యీ రుద్రాక్షని నిత్యం పూజించేవారు . పేరు ప్రఖ్యాతులు , సర్వసంపదలు లభించి జీవితకాలమంతా సుఖసంతోషాలతో గడిపి అంత్యమున ఉత్తమగతులు పొందుతారు . 

 ⭕23. గౌరీ శంకర రుద్రాక్ష

 ✴️రెండు రుద్రాక్షలు ఒకదానితో మరొకటి అతికినట్లుగా కన్పించేది యీ గౌరీశంకర రుద్రాక్ష 
 ✴️దీనిని గౌరీశంకరుల స్వరూపమైన అర్ధనారీశ్వర ప్రతిరూపముగా భావిస్తారు . 
 ✴️ అర్థనారీశ్వర తత్త్వమునందు స్త్రీ - పురుష శక్తులు సమానము . 
 ✴️ఏకముఖి రుద్రాక్ష లభించనివారికి అంతటి ఫలాన్ని అందిస్తుంది యీ ద్విభుజి 
 ✴️దీనిని ధరించిన వారికి ఇష్టదేవతా దర్శనము ' లభిస్తుంది . 
 ✴️దీనిని ధరించిన వారు శివపార్వతుల అనుగ్రహపాత్రులై వర్తమాన జన్మముతో పాటు మరో ఏడు జన్మలపాటు సర్వసుఖములు పొందుతారు . దీనిని ధరించిన వారికి అఖండమైన కీర్తిప్రతిష్టలు , అనంత ఐశ్వర్య సంపదలు లభిస్తాయి .
దీనిని గృహమునందు పూజా మందిరములో వుంచి నిత్య పూజ చేసిన వారికి సిద్ధులు లభించి సర్వ సంకల్పాలు సిద్ధిస్తాయి . *అఖండ రుద్రాక్ష'గా భావించే ఏకముఖి రుద్రాక్ష వలె యీ ద్విభుజి కూడా మహిమాన్వితమైనది గాన దీనిని ధరించినవారికి శివపార్వతులతో పాటు సర్వదేవతల శక్తి అనుగ్రహం లభిస్తుంది .

⭕ 24.గణేశ రుద్రాక్ష 
 విఘ్నేశ్వరుడు దీని అధిదేవత . ఇతడు శివపుత్రుడు . దీనిని ధరిస్తే వివాహ జీవితంలోసుఖం , సంతానప్రాప్తి . ఏకార్యం తలపెట్టినా జయప్రదంగా పూర్తి అవుతుంది . 

25.బ్రహ్మరుద్రాక్ష

మూడు రుద్రాక్షలు కలిసినట్లు ఒకటిగా గోచరించు యీ త్రిభుజి బ్రహ్మ , విష్ణు , మహేశ్వర ప్రతిరూపము .
✴️వేదమురుషుడైన వరబ్రహ్మమే ' త్రిభుజములతో ' త్రిమూర్త్యాత్మకమైన యీ '

బ్రహ్మరుద్రాక్ష స్వరుపంగా అవతరించాడు . 
✴️దీనిని ధరించినవాడు ప్రజాపరిపాకుడు కాగలడు . 
✴️దీనిని ధరించిన వారిపై ఎలాంటి క్షుద్ర మంత్ర - తంత్ర ప్రభావాలు పని చెయ్యవు . 
✴️దీనిని ధరించిన వాడు సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రునివలె నూతన విషయాలు కనిపెడతాడు.

⭕25. త్రిజుటి రుద్రాక్ష .

మూడు భుజముల వలె మూడు రుద్రాక్షలుగా కలిసి వుండే యీ రుద్రాక్షని ' త్రిజుటి రుద్రాక్ష ' అంటారు . 
ఇది త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వర ' ప్రతీక . దీనిని ధరించిన వారి వంశమును పుత్రపౌత్రాభివృద్ధియగునట్లు బ్రహ్మదేవుడు అనుగ్రహిస్తాడు . వారికి అష్టఐశ్వర్య భోగభాగ్యములను విష్ణువు ప్రసాదిస్తాడు . ఈ త్రిజుటి రుద్రాక్ష ధారకులను

ఆయురారోగ్యాలతో సంరక్షించి జీవితాంతమున కైవల్యాన్ని ప్రసాదిస్తాడు మహేశ్వరుడు . 
దీనిని ఏ సోమవారం నాడైనా లేదా ఏ పర్వదినమందైనా ముందుగా శివాలయమందు అభిషేకం జరిపించాక త్రిమూర్తులను స్మరించుకుంటూ ధరించాలి . 
ధారణామంత్రం : ఓం బ్రహ్మ విష్ణు మహేశ్వర ఏకాత్మ రూపాయనమః ధారాణానంతరం విష్ణు , శివస్తోత్రములను పఠించడం వల్ల విశేష పుణ్యఫలం లభిస్తుంది.

⭕26. త్రివింశతి ముఖి రుద్రాక్ష . 

ఇరవైమూడు ముఖాలు గలది యీ ' త్రివింశతిముఖి రుద్రాక్ష ' . ఇది చాలా అరుదుగా లభిస్తుంది .
 దీని ధర షుమారు 20 లక్షల రూపాయలు దాకా వుంటుంది . దీనిని ఒక్కసారి కంటితో

చూసినా మహాపుణ్యం లభిస్తుంది . వృత్తి , వ్యాపార రంగాల్లో అత్యున్నతస్థాయిని ఆశించే పారిశ్రామికవేత్తలు , బాలివుడ్ స్టార్సు , ప్రముఖ పొలిటీషియన్స్ యీ ' త్రివింశతిముఖి ' కోసం విశ్వప్రయత్నాలు చేస్తుంటారు . అయితే ఎవరో అదృష్ట జాతకులకి మాత్రమే యిది లభిస్తుంది . ఎప్పుడు దొరికితే అప్పుడే తిధి వార నక్షత్రాలు ఆలోచించకుండా వెంటనే దీనిని ధరించడం ఉత్తమం . 
 🔶ధారణా మంత్రం : ఓం నమః శివాయః

రుద్రాక్ష కోసం మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి పేజీ లో video  కూడా  జోడించడం జరిగింది దయచేసి గమనించగలరు.

రుద్రాక్షలు మావద్ద లభించును.
మీ జాతకం ప్రకారం ఎటువంటి రుద్రాక్ష ధరించాలి అని కూడా చెప్పగలము.
PH:9640633335 

COURIER ద్వారా HOME DELIVERY చేయబడును.

వాట్సాప్  గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి 
link మీదా క్లిక్ చేయండి :https://chat.whatsapp.com/G28wmzDDomY8Sx97UhFqMH






Comments

Popular posts from this blog

గోమేధికం(GARNET) ధరించడం వల్ల ఉపయోగాలు ఏంటి ?

పచ్చ (Emerald) పచ్చ ఎవరు ధరించాలి దాని వల్ల ఉపయోగాలు ఏంటి