లక్ష్మీ గవ్వలు ,

లక్ష్మీ గవ్వలు క్షీరసాగరాన్ని మధించినప్పుడు శంఖముతో పాటు అవతరించాయి ' లక్ష్మీగవ్వలు ' శంఖాన్ని లక్ష్మీదేవి సోదరునిగా భావిస్తే ' గవ్వ ని ఆమెకి చెల్లెలిగా భావిస్తారు . గవ్వల్లో రకరకాల , రంగురంగుల గవ్వలెన్నో వున్నా - " పసుపురంగు'లో ప్రకాశించే గవ్వలని ' లక్ష్మీ గవ్వలు'గా లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తారు . వేద కాలంలో ఆర్థిక లావాదేవీల కోసం ' గవ్వలని ' నాణాలుగా వాడేవారు . ఆ కాలంలో కాసులు , నాణాలు , వరహాలు , రూపాయిల తయారీ గానీ , చెలామణి గానీ ఏర్పడలేదు . అప్పటివారు డబ్బు సంబంధమైన యిచ్చి పుచ్చుకునే వ్యవహారాలు కోసం ' లక్ష్మీ ' సహోదరి అయిన ' గవ్వ'ని వినియోగించేవారు . ఆ రోజుల్లో డబ్బుని లెక్కించే వస్తువు గవ్వ . ఎవరివద్ద ఎన్ని గవ్వలుంటే వారు అంత ధనవంతులు . గవ్వకి వున్న విలువ , ప్రాముఖ్యత అంతా యింతా కాదు . ధనం లేని దరిద్రులని ' చిల్లిగవ్వయినా లేని సన్నాసి ' అనేవారు . అంటే చిల్లి గవ్వకున్న పాటి విలువ కూడా దరిద్రుడికి లేదన్నమాట . ' చిల్లు గవ్వకూడా ' చెల్లుబాటయ్యేదన్నమాట . అలాగే ఏ పనీ చెయ్యని సోమరిపోతుని ' పనికి మాలిన...